రామ పుత్ర దాస స్పందన:

ప్రియమైన సంపాదకులారా, హరేకృష్ణ. మీ అకించన గోచర నందు, స్వలింగ వివాహ వేడుక ఇస్కాన్ వారి అధికారిక కార్యక్రమంగా ప్రచురించిన వార్త అసత్యం. నా పేరు రామ పుత్ర దాస, నేను 1984 నుంచి ఇస్కాన్ నందు క్రియాశీల సభ్యుడిని. నా సొంత నిర్ణయం మరియు స్వతంత్రం తో నేను విరోనిక మరియు టటియానే అనబడే భక్తులకు ఆశీర్వచనం వేడుక నిర్వహించాను. ఈ వేడుక ఒక ప్రైవేటు స్థలము నందు జరిగినది. ఆ స్థలమునకు ఇస్కాన్ కు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఆ ఇంటి యజమాని దానిని ఇస్కాన్ సేవలో వినియోగిస్తున్నారు. మీరు మీ తరువాతి ప్రచురణలో నా ఈ స్పందనను జోడించాలని ప్రార్థన, ఇలా చేసిన ఎడల ఇస్కాన్ బ్రెజిల్ కు  అపకీర్తి కలుగదు మరియు మీ ప్రచురణ సత్యమైనది అవుతుంది.

ధన్యవాదములు, హరే కృష్ణ!

రామ పుత్ర దాస: నేను ప్రస్తుతం నవ గోకులానికి నాయకుడు కాను.

మరి కొందరు ఇస్కాన్ అధికారుల స్పందన

లోకాక్షి దాస (.సి.బి.ఎస్.పి):

భక్తి హౌస్ ISKCON మందిరం కాదు. ఇస్కాన్ వారికి సంబంధించినది కూడా కాదు. అది కేవలం ఒక జంటకు చెందిన స్థలం. వారిలో ఒకరు న్యాయవాది మరొకరు అకౌంటెంట్. వారి ఆధ్వర్యంలో ప్రతి వారము హఠ యోగ తరగతులు మరియు కృష్ణచైతన్యమునకు సంబంధించిన సంభాషణలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలన్నీ నారదముని దాస అనే భక్తుని ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. నేను మరియు ఇతర భక్తులు అక్కడ మాట్లాడేందుకు ఆహ్వానించబడ్డాము. అంతమాత్రాన మేము అక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరితో మరియు అక్కడ జరిగే అన్ని కార్యక్రమాలతో ఏకీభవిస్తాము అని కాదు.

శ్రీల ప్రభుపాదుల వారికి జయము కలుగు గాక,

మీ సేవకుడు

లోకాక్షి దాస (.సి.బి.ఎస్.పి)

మా సమాధానం:

మేము కేవలం నిష్పక్షపాతంగా నిజాలను ప్రచురిస్తున్నాము. ఈ వేడుకకు ఇస్కాన్ గురువు మరియు సన్యాసి అయినటువంటి చంద్రముఖ స్వామి వారి ఆశీర్వచనములు లభించినవి. ఈ వేడుకను నిర్వహించిన రామ పుత్ర దాస ఇస్కాన్ నందు క్రియాశీలుడు మరియు ప్రముఖుడు. ఇస్కాన్ యొక్క నిర్వహణ వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఉంటారు. సామాన్య జనం ఆయనను సంస్థ యొక్క ప్రతినిధిగా చూస్తారు. రామ పుత్ర దాసు యొక్క ఆధ్యాత్మిక గురువు హృదయానందదాస గోస్వామి.

ఒకవేళ ఇస్కాన్ బ్రెజిల్ కు ఈ వేడుక తో ఎటువంటి సంబంధం లేని యెడల వారు కచ్చితంగా వారి అధికారిక మాధ్యమాల ద్వారా దీనిని ప్రకటించి ఉండాలి, ఈ వేడుక ఇస్కాన్ వారికి సంబంధించిన స్థలము నందు జరగకపోయినా, అది జరిగిన ప్రదేశానికి ఇస్కాన్ అధికారులు పలుమార్లు వెళ్ళటం, అధికారిక మాధ్యమాల ద్వారా ఈ స్థలాన్ని పలుమార్లు ప్రచారం చేయడం జరిగినది. ఈ స్థలమును ఇస్కాన్ నందు దీక్షను స్వీకరించిన భక్తుని చే నిర్వహింపబడుచున్నది. తరుచూ ఇస్కాన్ బ్రెజిల్ యొక్క గవర్నింగ్ బాడీ అధికారక మీటింగ్ నందు పాల్గొనే రామ పుత్ర దాస మరియు చంద్రముఖ స్వామి ఈ వేడుకకు పూర్తి మద్దతు మరియు చేయూతను అందించారు. ఇందువలన ఈ సంఘటన మందిరము నందు జరిగనా లేదా జరగకపోయినా, ఇది సంస్థ నిర్వరించిందిగా ప్రకటించుట సమంజసమని మేము తలచాము.

గత సంవత్సరం ఏప్రిల్ నందు నవ గోకుల యొక్క ఆధికారిక పేజీలోని ఒక ప్రకటనలో రామ పుత్ర దాసును నవ గోకుల యొక్క మేనేజర్ గా ప్రకటించారు. కనీసం 2016 నుండి ఇస్కాన్ నాయకుల యందు ఆయన కూడా ఒకడు. అందుచేత మేము ఇప్పటికీ కూడా రామ పుత్ర దాసు ఆస్థానం నందే కొనసాగుతున్నారని భావించాము.

Follow us

Share:

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Leave the field below empty!