ఈ క్రింది వ్యాసం ఒక బ్రెజిలియన్ పోర్చుగీస్ లోని Razões para Acreditar అను న్యూస్ వెబ్సైట్ నుంచి అనువదించబడింది.


విరోనిక మోన్టేయిరో ( 23 సంవత్సరములు) మరియు టటియానే ఆల్వెస్ ( 25 సంవత్సరములు) ఒక అందమైన వివాహ వేడుక తో ఒక్కటయ్యారు. ఈ వివాహాన్ని taubate(SP) లోని హిందూత్వ సాంప్రదాయ వర్గానికి చెందిన హరే కృష్ణ ఉద్యమం వారు నిర్వహించారు. ఇది ఎంతో ఉద్రేకపూరితమైనది మరియు హరికృష్ణ ఉద్యమము నందు ఇది మొట్టమొదటి స్వలింగ వివాహం.

“మేము శ్రీకృష్ణభగవానుడు మరియు భక్తుల ఆశీర్వాదములతో పెళ్లి చేసుకున్నాము ఇప్పటివరకు ఈ ఉద్యమంలో ఒకే ఒక్క స్వలింగ వివాహం 2009లో లాస్ ఏంజలెస్ నందు జరిగినది. అప్పట్లో దీనిపై చాలా వ్యతిరేక భావాలు వ్యక్తమయ్యాయి. మళ్లీ 10 సంవత్సరాల తర్వాత మేము ఈ వివాహము ద్వారా మనమందరము ఈ భౌతిక దేహాలు కాక నిత్యమైన ఆత్మలము అనే సత్యాన్ని తిరిగి రుజువు చేసాము. 2009లో జరిగిన వివాహం ఎవరికీ అంతగా తెలియదు, 2017లో ఈ విషయం గూర్చి అన్వేషించినపుడు నాకు తెలిసింది” అని వేరోనికా అన్నారు.

ఈ వేడుక భక్తియోగ హౌస్ నందు జరిగినది. ఈ అందమైన వివాహానికి సహకరించిన భక్తులు మరియు తల్లిదండ్రుల వివరాలు వారు పేర్కొన్నారు.

“వారికి ఎటువంటి అవసరం లేకపోయినప్పటికీ వారంతట వారు ఇష్టానుసారంగా మాకు సహాయ సహకారాలను అందించారు. మాకు సహకారాలు అందించిన టువంటి భక్తులందరికీ, తల్లిదండ్రులకు, పూజారికి, చంద్రముఖ స్వామి మహారాజ్ గారికి చాలా రుణపడి ఉన్నాము. చంద్రముఖ స్వామి నాకు ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించారు” అని ఆమె తెలిపారు.


 

 

ఛాయాచిత్రాలు

ఈ వేడుక యొక్క ఛాయాచిత్రాలను dezanove అనే వార్త వెబ్ సైట్ నుంచి సేకరించబడ్డాయి.

_MG_7062 (1).jpg

_MG_6916.jpg

_MG_7006.jpg

_MG_7187.jpg

 

ఈ క్రింది వ్యాసం యూరోపియన్ పోర్చుగీస్ లోని LGBT వార్త వెబ్ సైట్ dezanove నుంచి స్వీకరించి అనువదించబడినది.


 

వేరోనికా మోన్టేయిరో (23 సంవత్సరములు) మరియు టటియానే ఆల్వెస్ (25 సంవత్సరములు) హరే కృష్ణ సంప్రదాయ పద్ధతులను అనుసరించి బ్రెజిల్ నందు వివాహమాడారు, అని ఆ జంట తెలిపారు. అందరికీ తెలిసినది మరియు మొట్టమొదటి హరే కృష్ణ స్వలింగ వివాహము 2009 లాస్ ఏంజలెస్ నగర ముందు ఇద్దరు పురుషుల నడుమ జరిగినది.

“ఈ వివాహ వేడుక Sao Paulo రాష్ట్రం Taubate నగరం నందు కల భక్తియోగ హౌస్ నందు జరిగినది. మనకు Taubate నందు మందిరము లేదు. భక్తుల సత్ సంఘాలన్నీ ఒక భక్తుని గృహమునందు జరుపుకుంటాము. ఆ భక్తుడు దానిని వారి న్యాయ మరియు అకౌంటింగ్ కార్యాలయంగా ఉపయోగిస్తారు. భక్తులు ఎల్లప్పుడూ సేవ చేసేవిదంగానే ఆయన వారి స్థలము నందు ఆదివారం రోజున సండే ప్రోగ్రామ్స్, ఉచితంగా యోగ, కీర్తన (మంత్ర ధ్యానం), సత్సంగం తదుపరి శాకాహార భోజనం నిర్వహించడానికి ఉపయోగిస్తారు. భక్తులు వారి గృహమునకు భక్తియోగ హౌస్ అని నామకరణము చేశారు” అని వేరోనికా dezanoveకి తెలిపింది.

ఈ హరే కృష్ణ ఉద్యమము ఎవరి పట్ల వివక్షను చూపించదు. భగవంతుడు ఎవరిపై వివక్ష చూపించడు. నేను Guarulhos నందు ఒక మీటింగ్ కి వెళ్ళినప్పుడు అభిచేత దాస అనే భక్తుడు మొట్టమొదటిసారి మనమందరం ఆత్మల మని, మనము ఈ శరీరములు కాదు అని చెప్పాడు”, అని విరోనికా చెపుతూ “కొందరు భక్తులు దీని గురించి పక్షపాత దోరని మరియు చాలా చిన్నదైన మనస్తత్వము కలిగివుంటారు. ఇలా ప్రతి మతము నందు ప్రాంతము నందు జరుగుతుంది. మనము ఎప్పుడూ వ్యతిరేకించే వారినిమరియు కొందరు అంగీకరించే వారిని చూస్తుంటాము. కానీ మనము ఇలాంటి దానికి శ్రీకారం చుట్ట కుంటే ఎప్పటికీ ఇలానే మిగిలిపోతాం. నేను ఇలా జరిగేందుకు ఆస్కారం ఉన్న దాన్ని గమనించిన వెంటనే ఈ ఉద్యమంలో పురోగమించినటువంటి భక్తులకు ఇ-మెయిల్స్ మరియు మెసేజీలు పంపడం ప్రారంభించాను. అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘము నందలి ఆధ్యాత్మిక గురువు మరియు సన్యాసి అయినటువంటి చంద్రముఖ స్వామి వారు నా సందేహాలు అన్నింటిని ఓపిక మరియు కరుణతో నివృత్తి చేశారు. ఆయన నాకు తమ సంఘము స్వలింగ వివాహమును చూసే వైఖరిని, అర్థము చేసుకునే విధానమును గురించి అనేక ఆడియో టేపులను పంపారు. ఇస్కాన్ స్వలింగ వివాహమును స్వీకరించదని, కానీ ఒక సంబందానికి శ్రీ భగవానుని ఆశీస్సులు ముఖ్యమని తెలిపి మేము మా భావాల పట్ల ఖచ్చితత్వమును కలిగి ఉంటే రామ పుత్ర అనే బ్రాహ్మణ పూజారి దగ్గరకు వెళ్లి ఈ వేడుక గురించి మాట్లాడమని సూచించారు” అని ఆమె గుర్తు చేసుకుంది.


 

పూర్వ వృత్తాంతం

ఈ వేడుక నందు సహకరించినటువంటి అధికారుల వృత్తాంతము ఈ క్రింద తేయియజేయడమైనది.

Hridayananda Dasa Goswami: హృదయానంద దాస గోస్వామి వారు ప్రస్తుతం బ్రెజిల్ యొక్క జీబిసిగా, ధన్వంతరి స్వామి గారు కో-జిబిసిగా వ్యవహరిస్తూ వారి సేవలను అందిస్తున్నారు.

 

Chandramukha Swami: చంద్రముఖ స్వామి: 1986లో భారతదేశంలోని మాయాపూర్ నగర మందు సన్యాస దీక్షను స్వీకరించి అత్యంత గౌరవప్రదమైనటువంటి స్వామి అన్న బిరుదును అలంకరించారు. అటు పిమ్మట వారు బ్రెజిల్ ఇస్కాన్ నందు నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. మహారాజ్ వారి సహకారంతో Teresopolis, RJ నందు వ్రజ భూమి ఆశ్రమం నెలకొల్పబడింది. మహారాజు రచయిత మరియు సంగీతకారుడు. ఆయన యోగా తత్వము మరియు ఆధ్యాత్మిక అంశాలపై ఇరవైకి పైగా పుస్తకాలను రచించారు. 8 మంత్ర మరియు ధ్యాన సీడీలను విడుదల చేశారు. సామాన్య మానవులకు సైతం వేద విజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆయన సుప్రసిద్ధులు. (ఇస్కాన్ లీడర్స్ అనే వెబ్ పేజీ నుంచి స్వీకరించబడింది).

Rama Putra Das: రామ పుత్ర దాస: ఈయనని మనం మొదటి వ్యాసంలోని ఒక చిత్రంలో యజ్ఞం చేస్తున్న బ్రాహ్మణుడిగా చూడవచ్చు. ప్రస్తుతం ఇస్కాన్ బ్రెజిల్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన నవ గోకుల ఫార్మ్ కమ్యూనిటీకి నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈయన హృదయానందదాస గోస్వామి వారి శిష్యులు.

 

Follow us

Share: