Categories: Uncategorized

హృదయానందం దాస గోస్వామి నా ఈ ఇచ్చా పూర్వక కార్యాన్ని అభినందించారు – స్వలింగ వివాహం వేడుకను నిర్వహించిన ఇస్కాన్ బ్రాహ్మణుడు.

రామ పుత్ర  దాసు చే రచింపబడిన ఈ క్రింది వ్యాసం మొట్టమొద గే అండ్ లెస్బియన్ వైష్ణవ అసోసియేషన్ (GALVA108) వారి ఫేస్ బుక్ పేజీలో ప్రచురించబడినది.

మరిన్ని వివరాల కొరకు, ఈ వషయంపై మా పూర్వ ప్రకటనను చదవండి.

ప్రియమైన వైష్ణవులకు మరియు వైష్ణవినులకు నా యొక్క వినయపుర్వక వందనములు,

శ్రీల ప్రభుపాదుల వారికి జయము కలుగుగాక, హరేకృష్ణ!

ఈ మధ్యకాలంలో నేను విరోనిక మరియు టటియనా వారి యొక్క స్నేహితులు మరియు కుటుంబీకులతో నిర్వహించిన ఆశీర్వచన వేడుకను గూర్చి ఇస్కాన్ వారి అంతర్జాతీయ వెబ్సైట్ నందు ఒక ఎలక్ట్రానిక్ ప్రచురణ వచ్చింది. ఈ వేడుక వారి స్వలింగ వివాహమును ఆశీర్వదించుటకు జరుపబడినది.

దీని మీద ఎన్నో అనుకూల మరియు ప్రతికూల సందేశాలు వస్తున్నాయి. కావున దీనిని గురించి స్పష్టత ఇచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నాను.

నేను ఈ వేడుకకు ముందు నా ఆధ్యాత్మిక గురువైన హృదయానంద దాస గోస్వామి గారిని సంప్రదించాను. ఆయన ఇస్కాన్ నందు స్వలింగ వివాహం జరుపుటకు ఎటువంటి పాలసీలు లేవని హెచ్చరించారు. ఆయన నా ఇష్టాన్ని పొగడారు. స్వలింగ దంపతులను ఆశీర్వదించే నిర్ణయం కేవలం నాదే, ఇది 20 సంవత్సరాల సుదీర్ఘమైన అగ్నిహోత్ర నిర్వహణ అనుభవంతో తీసుకోబడినది.

నేను ఇస్కాన్ నందు ప్రస్తుతం ఎటువంటి కార్యనిర్వాహన పదవిని కలిగి లేను. కానీ నేను 1984 నుండి నవ గోకుల ధామము నందు నివసిస్తున్నాను. ధామము కొరకు ఎన్నో సంవత్సరాలుగా చందాలను స్వీకరిస్తున్నాను. నేను భార్యాబిడ్డలను సైతం కలిగి ఉన్నాను. మరియు పైన తెలిపిన కలయిక కేవలం వ్యక్తిగతమైనది.

ఈ వేడుక Taubate (SP) నందు కల భక్తియోగ హౌస్ నందు జరిగినది. ఈ స్థలము ఇస్కాన్ వారి కీర్తనలు వారాంతపు ప్రవచనములకు కూడా వినియోగిస్తుంటారు. ఈ స్థలము యొక్క లబ్ధిదారులు ISKCONకు సన్నిహితులు మరియు చేయూతనిచ్చేవారు. ఈ వేదికను పర్యవేక్షించే నారదముని దాస, కృష్ణ కృప దేవి దాసి, మరియు ప్రశాంత దాస అనే భక్తులు వారిని ఎల్లప్పుడూ ఆహ్వానించేవారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు సరైన శాస్త్రీయ ఆధారాలు మరియు ఉదాహరణలు ఎరిగి ఉండక పోవడంచే నాకు స్వలింగ దంపతుల పట్ల సానుకూల భావాలు లేకపోయేవి, అని తెలుపుతున్నాను.

ఏదేమైనప్పటికీ నాకు ఇప్పుడు శ్రీల ప్రభుపాద ద్వారా స్థాపితమైన ఈ సంస్థయందు నిజాయితిగా సేవ చేసే వారి ఉదాహరణలు తెలుసు. ఈ బాలికల విషయానికి వస్తే వారు ఎల్లప్పుడూ పాతివ్రత్యంపై ఇష్టాన్ని చూపేవారు, ఆ విదంగా సత్వగుణంపై అవగాహనను వ్యక్తపరిచేవారు. ఆశీర్వచననానికి మూడు నెలల ముందునుంచి వారి తో నేను మాట్లాడుతున్నాను. వారి నిజాయితీ, ఈ సంబంధం పట్ల అంకితభావం నన్ను ఈ వేడుకను చేయుటకు ప్రేరేపించాయి.

ఈ వేడుక సమయంలో వారు అన్ని వివాహ నియమాలకు అంగీకరించి ప్రమాణాలను చేశారు.

నేను CGB-బ్రెజిల్ కమిటీ నందు 2016 లో పాల్గొన్నప్పుడు జరిగిన సంభాషణల నుంచి ప్రేరణ పొందాను. ఈ అంశంమీద అప్పట్లో చాలా చర్చించినప్పటికీ ఒక అభిప్రాయానికి రాలేకపోయాము. కమిటీ సభ్యులంతా పలు బృందాలుగా విడిపోయి రకరకాల భావాలతో మిగిలిపోయారు. అనేక అభిప్రాయాలు ఉన్నా కూడా మేమందరము చివరికి ఒక లేఖను వ్రాసాము. దాని నుంచి కొంత భాగాన్ని నేను ఇక్కడ పొందుపరుస్తున్నాను.

భగవద్గీత అధ్యాయము 4 శ్లోకం 35 నందు భగవానుడు ఈ విధంగా పలుకుతున్నాడు ఆత్మ దర్శి అయిన మహాత్ముని నుండి యదార్థ జ్ఞానమును పొందినప్పుడు మరల నీవు ఎప్పుడు ఇట్టి మోహము నకు గురికావు. జ్ఞానము చే సమస్త జీవులు పరమాత్మ అంశలే అని లేక వేరు మాటలలో అవన్నీ నాకు సంబంధించినవిగా తెలుసు కొందువు.” ఈ వాక్యాలను అనుసరించి ఎవరైనా నిజాయితీ కల వ్యక్తి ఇస్కాన్ నందు ఉంటూ భగవానుడు అయినటువంటి శ్రీ కృష్ణుని చేరుకోవాలనే ప్రతి ఒక్కరిని ఎటువంటి వివక్ష, ఉదాహరణకు లింగ భేదం, లేకుండా ఆహ్వానించావచ్చు. శ్రీల ప్రభుపాద వారు దేశకాలమాన పరిస్థితులను సరిగా అన్వయించినట్లు, ఇస్కాన్ వారు కూడా ఆ విదంగా పురోగతి సాదిస్తున్నారు, ప్రభుపాదుల వారి అనుచరులకు నా కృతజ్ఞతలు.

చివరగా శ్రీల ప్రభుపాద వారి బోధనల నుంచి కానీ గౌడియ సంప్రదాయ మందు గాని నేను స్వలింగ కార్యక్రమాల గురించిన వివరాలను కనుక్కోలేకపోయాను అని చెప్పదలిచాను. ప్రతి వివాహ ఆచారముల యందు వధువు మరియు వరుని వేరు వేరు విధానాలు ఉన్నవి. కానీ సామాన్య దృష్టితో ఈ రెండు ఆత్మలను ఆశీర్వదించ దలచి మంగళ జ్వాలను వెలిగించి, వారిని బంధువుల మరియు స్నేహితుల సమక్షంలో ఆశీర్వదించాను. ఈ విధంగా కేవలం ఇది ఒక ఆధ్యాత్మిక, మానవిక, మరియు సామాజిక కార్యక్రమం మాత్రమే.

మీ సేవకుడు,

రామ పుత్ర దాస

Share:

Follow us

sankirta

Share
Published by
sankirta

Recent Posts

స్వలింగ వివాహంపై మేము వ్రాసిన వ్యాసానికి ఇస్కాన్ బ్రెజిల్ అధికారుల స్పందన

రామ పుత్ర దాస స్పందన: ప్రియమైన సంపాదకులారా, హరేకృష్ణ. మీ అకించన గోచర నందు, స్వలింగ వివాహ వేడుక ఇస్కాన్…

5 సంవత్సరాలు ago

మొట్టమొదటి హరే కృష్ణ స్వలింగ వివాహ వేడుక నిర్వహించిన ఇస్కాన్ బ్రెజిల్

ఈ క్రింది వ్యాసం ఒక బ్రెజిలియన్ పోర్చుగీస్ లోని Razões para Acreditar అను న్యూస్ వెబ్సైట్ నుంచి అనువదించబడింది.…

5 సంవత్సరాలు ago

స్వలింగ వివాహంపై మేము వ్రాసిన వ్యాసానికి ఇస్కాన్ బ్రెజిల్ అధికారుల స్పందన

రామ పుత్ర దాస స్పందన: ప్రియమైన సంపాదకులారా, హరేకృష్ణ. మీ అకించన గోచర నందు, స్వలింగ వివాహ వేడుక ఇస్కాన్…

5 సంవత్సరాలు ago

బ్రెజిల్‌లో స్వలింగ వివాహాలు అనుమతించాలి అనే విషయాన్ని పరిగణిస్తున్న ఇస్కాన్

ఈ క్రింది ప్రకటన ఇస్కాన్ బ్రెజిలియన్ గవర్నింగ్ బాడీ యొక్క అధికారిక ఫేస్బుక్ పేజీ నుండి గ్రహించి అనువదించబడినది  ఇస్కాన్…

5 సంవత్సరాలు ago

Submit an article

Akincana Gocara accepts article submissions written in any Indian language, including Sanskrit. In order to…

5 సంవత్సరాలు ago