ఇస్కాన్ సంస్థ యొక్క బ్రెజిలియన్ గవర్నింగ్ బాడీ (CGB) తమ ద్వారా నిర్వహించబడినది అంటున్న స్వలింగ వివాహ వేడుక గురించి ఒక స్పష్టత నిచ్చింది. ఈ వేడుక సంస్థకు ఎటువంటి అధికారిక సంబంధం లేని ఒక ప్రైవేటు స్థలము నందు జరిగినది. పూజారి అయిన రామ పుత్ర దాస ఇస్కాన్ కు 1984 నుండి క్రియాశీల సభ్యుడు. ఆయన మాటల ప్రకారం ఇది కేవలం ఒక ఆశీర్వచన (మంగళ) వేడుక అని అవగతం అవుతున్నది. అతను స్వతంత్రంగా, అతని వ్యక్తిగత అవగాహనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అదే సమయంలో మేము దీనిని ఒక ఆలోచించవలసిన టువంటి ప్రశ్నగా గుర్తించి పరిగణిస్తున్నాం. ఈ సందర్భమున మేము మీకు 2016 లో వేసినటువంటి కమిషన్ గురించి గుర్తుచేస్తున్నాము. ఈ కమిషను మతపరమైన స్వలింగ వివాహాలను జరిపేందుకు వీలును గుర్తించి, ఈ ప్రాంతం నందు ఉన్న ఇటువంటి వారందరినీ ఆదరించి, వారిని శ్రీకృష్ణ భగవానునికి దగ్గరగా తెచ్చేందుకు ఉద్దేశించబడినది. అయినా అప్పట్లో మేము ఈ కమీషను ద్వారా ఒక నిర్ణయానికి రాలేక పోయాము. మేము గవర్నింగ్ బాడీ కమిషన్ మరియు శాస్త్రీయ అడ్వైజరీ కమిటీ వారికి కట్టుబడి ఈ అంశంపై వారిని సంప్రదిస్తాము.
ఈ ఆధునిక యుగంలో అత్యంత ఉత్తమమైన ఆత్మ సాక్షాత్కార విధానము అందరికీ చేరువై ప్రతి ఒక్కరూ భగవానుని దాసాను దాసునిగా అనుభూతి పొందే అవకాశం కలిగించే శ్రీ చైతన్య మహా ప్రభువుల వారి ఈ సంకీర్తన ఉద్యమము ప్రతి ఒక్కరిని ఆదరిస్తుందని కోరుకుంటున్నాము.
అందరూ కుశలమే అని ఆశిస్తూ. మేము మీ అందరికీ ఎల్లప్పుడూ సవినయంగా సేవలు అందిస్తాము.
-ఎగ్జిక్యూటివ్ కమిటీ
బ్రెజిలియన్ గవర్నింగ్ బాడీ